హనుమకొండ, అక్టోబర్ 15 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చరిత్రలో నిలిచేలా వరంగల్ నగరం అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. క్రెడాయి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన హనుమకొండ హంటర్ రోడ్డులోని విష్ణుప్రియాగార్డెన్లో రెండు రోజుల ప్రాపర్టీ షోను శనివారం చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్తో కలిసి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయమన్నారు.
వరంగల్ నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, అందులో భాగంగా నూతన మాస్టర్ ప్లాన్‌తోపాటు, ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ, ఔటర్‌రింగ్ రోడ్, నియో రైలు మార్గాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో త్వరలోనే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్ప ష్టం చేశారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఇప్పటికే వరంగల్ నగరం ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని.. వైద్యం, కల్చరల్, టూరిజం, స్పోర్ట్స్ హబ్‌గా మారుతుందన్నారు. ప్రాజెక్టుల వద్ద పనిచేసే భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌కార్డులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బిల్డర్లను, క్రెడాయి ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో క్రెడాయి ప్రతినిధులు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, జగన్మోహన్, శరత్‌బాబు, సత్యనారాయణరెడ్డి, మనోహర్, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, రాంరెడ్డి, అమరలింగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.