సమానత్వం బసవన్న తత్త్వం..!
బసవన్న | సకల జనుల సమానత్వమే బసవన్న తత్త్వం అని తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్ దేవగిరి వెంకటరాజేశ్వర శర్మ పేర్కొన్నారు.

పాలకుర్తి/జనగామ : సకల జనుల సమానత్వమే బసవన్న తత్త్వం అని తెలంగాణ అర్చక ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్ దేవగిరి వెంకటరాజేశ్వర శర్మ పేర్కొన్నారు. సోమనాథ కళాపీఠం అధ్వర్యంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం విశ్వగురు బసవ 888వ జయంతి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగింది. డాక్టర్ రాపోలు సత్యనారాయణ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా డీవీఆర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వెంకటరాజేశ్వర శర్మ మాట్లాడారు.
బసవన్న ప్రబోధించిన కాయక, దాసోహ సుగుణాలు నీతివంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతాయని ఆయన అభివర్ణించారు. విశిష్ట అతిథి ప్రధానార్చకులు దేవగిరి రామన్న లింగార్చన అధికారాన్ని అందరికి అందించిన సంస్కర్త బసవన్న అని కొనియాడారు.
బసవపురాణం రాసిన మహాకవి పాలకురికి సోమనాథుని జన్మస్థలాన్ని సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు.
కార్యక్రమంలో దేవస్థాన ఈ వో వీరస్వామి, సూపరింటెండెంట్వెం కటయ్య, అర్చక బృందం దేవగిరి లక్ష్మన్న, అనిల్ కుమార్, నాగరాజు, సంతోష్, శ్యాం, సిబ్బంది బండారి శ్రీనివాసులు, నవీన్, సైదమ్మ, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు బక్కెర సిద్ధయ్య, పాలకుర్తి మండల గౌరవ అధ్యక్షుడు బక్కెర రవి, సోమనాథ కళాపీఠం గౌరవ సలహాదారు వి వెంకటేశ్వర రావు, అధ్యక్షురాలు రాపోలు శోభారాణి, కోశాధికారి ఇమ్మడి దామోదర్, మామిండ్ల రమేశ్ రాజా, గూడూరు లెనిన్, మేరుగు మధుసూదన్, రాపోలు సోం సాయి, గజ్జి సంతోష్, చిక్కమఠం పర్వతయ్య, భరత్, జి నరేందర్ రెడ్డి, పుట్ట అంజనేయులు, ఇప్పకాయల క్రాంతి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
పిడుగుపాటుకు మేకల కాపరి, మేకలు మృతి
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్‌లు
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

