హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లు మంగళవారం ఉదయం వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 19న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం హాల్‌టికెట్లను విడుదల చేశారు. ఎప్‌సెట్ పరీక్షలను ఈ నెల 29 నుంచి మే 4 వరకు నిర్వహించనున్నారు. రూ. 5వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ఈ నెల 24తో ముగియనున్నది.