Vemulawada | వేములవాడ టౌన్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని జూన్ 15 నుంచి విస్తరణ పేరుతో మూసివేయనున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని దేవస్థానం ఈవో వినోద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానం పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రకటనలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆలయంలో జరిగే ఆర్జిత సేవలన్నింటినీ నిలివేయబోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. భక్తులెవరూ అలాంటి వార్తలను నమ్మొద్దని కోరారు. ఫేక్ వార్తలను ఎవరూ షేర్ చేయొద్దని ఈవో కోరారు. ఈ విషయంలో వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో తప్పుదారి పట్టిస్తున్నారని.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఈవో గురువారం ఫిర్యాదు చేశారు.