హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రెన్స్ సజావుగా జరిగినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం తెలిపారు.
6,563 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే, 5,289 మంది పరీక్ష రాశారని ఆయన పేర్కొన్నారు.