English Practical | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఇంటర్ దశలోనే విద్యార్థులు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు అర్జించేలా తర్ఫీదునిచ్చేందుకు, ఇంగ్లిష్‌పై విద్యార్థుల్లోని భయాన్ని తొ లగించేందుకు ఇంటర్‌బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెకండియర్ ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్‌ను అమలుచేస్తుంది. నిరుడు ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్‌ను విజయవంతంగా అమలుచేయగా, ఈ ఏడాది సెకండియర్ విద్యార్థులకు విస్తరించారు. ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం(ఐఈఎల్టీఎస్) ఎగ్జామ్ తరహాలో ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. తాజా విధానంతో ఆర్ట్స్, సైన్స్, ఒకేషనల్ కోర్సులన్న తేడాలేకుండా అందరికీ ప్రాక్టికల్స్ తప్పనిసరి అయ్యాయి. ఇంగ్లిష్ సబ్జెక్టుకు 80 మార్కులు థియరీ, 20మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయిస్తారు. థియరీ ప్రశ్నపత్రాన్ని 80 మార్కులకు కుదించడంతో ప్రశ్నపత్రం స్వరూపం మారింది. మాదిరి ప్రశ్నపత్రాన్ని ఇంటర్‌బోర్డు వెబ్సైట్లో పొందుపరిచారు.
హైదరాబాద్, ఆగస్టు11 (నమస్తే తెలంగాణ): సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను పెం చాలని, బిల్లులను గ్రీన్ చానల్ పద్ధతిలో చె ల్లించాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆదివా రం హైదరాబాద్ బర్కత్‌పురా నుంచి వైఎంసీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆరేండ్ల క్రితం ధరల ప్రకారమే మెస్ చార్జీలను చెల్లిస్తున్నార ని, ధరలు పెరగడంతో కాంట్రాక్టర్లు నాసిరకం ఆహారం పెడుతున్నారని ధ్వజమెత్తారు. మె నూ పాటించడం లేదని చెప్పారు. ఫీజు రీయి ంబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ర్యాలీలో నాయకులు అర్జున్, ప్రవీణ్, రుద్ర, అభి, చరణ్ పాల్గొన్నారు.