ఈ ఏడాది తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియం
202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతులకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది తొమ్మిదోతరగతికి విస్తరిస్తారు. ఇప్పటివరకు 8వ తరగతి చదివిన విద్యార్థులకు తాజాగా 9వ తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని బోధిస్తారు. కాగా, రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 1 నుంచి 9వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది.
- ప్రత్యేక పాఠ్యపుస్తకాలను ముద్రించిన విద్యాశాఖ
- జూన్ 1 నుంచి 9 వరకు బడిబాట!
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): 202324 విద్యాసంవత్సరం ప్రభుత్వ బడుల్లో తొమ్మిదోతరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించింది. 2022 -23 విద్యాసంవత్సరంలో 1 నుంచి 8తరగతులకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించగా, ఈ ఏడాది తొమ్మిదోతరగతికి విస్తరిస్తారు. ఇప్పటివరకు 8వ తరగతి చదివిన విద్యార్థులకు తాజాగా 9వ తరగతిలో ఇంగ్లిష్ మీడియాన్ని బోధిస్తారు. కాగా, రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 1 నుంచి 9వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది.
ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల సంఖ్య పెంచడం, సమాజాన్ని స్కూళ్లతో అనుసంధానించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏటా బడుల పునః ప్రారంభానికి ముందే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని వారం, పది రోజుల పాటు విద్యాశాఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా జూన్లో బడిబాటను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి గతంలోనే ప్రకటించారు. ప్రాథమిక సమాచారం మేరకు జూన్ 1 నుంచి 9 వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. జూన్ 10, 11న సెలవులు ఉన్నందున 9వరకు నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించిట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

