టీచర్లకు బ్రిటిష్ కౌన్సిల్శిక్షణ
రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లను ఇంగ్లిష్ మీడియం బోధనకు సన్నద్ధం చేయనున్నారు.
- ఇంగ్లిష్ మీడియంపై 5 వారాల ట్రైనింగ్
- త్వరలో ఎస్సీఈఆర్టీ, ్రబ్రిటిష్ కౌన్సిల్ మధ్య ఎంవోయూ
- అజీం ప్రేమ్జీ వర్సిటీ సేవల కొనసాగింపు
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లను ఇంగ్లిష్ మీడియం బోధనకు సన్నద్ధం చేయనున్నారు. అందులోభాగంగా మరో విడత టీచర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎస్సీఈఆర్టీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు త్వరలోనే ఎస్సీఈఆర్టీ, బ్రిటిష్ కౌన్సిల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదరనున్నది. 2023 -24 విద్యాసంవత్సరంలో 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మాధ్యమాన్ని విస్తరించనున్నారు.
గతంలో అజీం ప్రేమ్జీ వర్సిటీ రూపొందించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సులో టీచర్లకు నాలుగు వారాల పాటు శిక్షణ ఇచ్చారు. 2022 మార్చి, ఏప్రిల్, జూన్ మాసాల్లో విడతల వారీగా శిక్షణ ఇవ్వగా, 82 వేల మంది టీచర్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ విజయవంతమైంది. దాంతో మరో 5 వారాల పాటు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. అజీం ప్రేమ్జీ వర్సిటీతోపాటు బ్రిటిష్ కౌన్సిల్తోనూ శిక్షణను కొనసాగించాలని అధికారులు ఇటీవలే నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

