Engineering Seats Allotment | తెలంగాణలో ఇంజినీరింగ్లో మొదటి విడతలో కేటాయింపు పూర్తయ్యింది. ఇందులో 85.45శాతం భర్తీ అయ్యాయి. 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 82,666 సీట్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ధ్రువపత్రాల పరిశీలనకు 76,821 మంది హాజరయ్యారు. ఆదివారం మొదటి విడతలో 70,665 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 12,001 సీట్లు మిగిలిపోయాయి. మూడు యూనివర్సిటీల్లో, 28 ప్రైవేట్ కాలేజీల్లో సీట్లన్నీ మొదటి విడతలో సీట్లు భర్తీ అయ్యాయి.
సీఎస్ఈ కోర్సుల్లో 94.20 శాతం సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఈఈఈలో 58.38శాతం, సివిల్లో 44.76శాతం, మెకానికల్ ఇంజినీరింగ్లో 38.50శాతం పూర్తయ్యింది. సీట్లు అలాట్ అయిన విద్యార్థులు ఈ నెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని టెక్నికల్ ఎడ్యూకేషన్ కన్వీనర్ వాకాటి కరుణ సూచించారు. మరోవైపు ఈ నెల 24 నుంచి రెండో విడత సీట్లు కేటాయించనుండగా.. ఆగస్టు 4 నుంచి తుది విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరుగనున్నది.