ఎన్ఫోర్స్మెంట్ను కట్టుదిట్టం చేయాలి
రాష్ట్ర రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను మరింత విసృ్తతం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను మరింత విసృ్తతం చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓవర్ లోడింగ్ వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు.
సూల్ బస్సులు, మినీ వ్యాన్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, అనుమతించిన సా మర్థ్యానికి మించి విద్యార్థులను తరలించే వాహనాలను సీజ్ చేయడంతోపాటు ఆ యా విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాలని, స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశా రు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్, జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్, డీటీసీ రవీందర్ కుమార్, వెంకట రమణ, సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

