హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భౌతికశాస్త్రం, గణితం టీచర్ల మధ్య పంచాయితీకి ముగింపు పలికేదిశలో సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. భౌతికశాస్త్రం టీచర్లు 6,7 తరగతులకు గణితం బోధించాలన్న నిర్ణయంలో కాస్త మార్పు చేయనున్నది. మధ్యే మార్గంగా ఎవరికి భారంకాకుండా మొత్తం పీరియడ్స్ సంఖ్యకు ఇరువురికి చెరోసగం చొప్పన సమానంగా పంచాలని నిర్ణయించింది. ఇది ఈ రెండు సబ్జెక్టు టీచర్లకు వర్తించనున్నది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు, మార్గదర్శకాలు త్వ రలోనే విడుదలకానున్నాయి. ఇటీవ లే సర్కారు భౌతికశాస్త్రం టీచర్లు 6,7 తరగతుల్లో గణితం బోధించాలని ఆదేశించిన నిర్ణయించిన విషయం తెలిసిందే.