వట్పల్లి, మే 30 : సింగూర్‌కు మరమ్మతుల మాటున సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల ఖాదిరాబాద్, సాయిపేట శివారు ముంపు ప్రాంతం(ఎఫ్టీఎల్) పరిధిలోని భూములను ఆక్రమిస్తున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. నియోజకవర్గ ముఖ్య నేతలు, సాయిపేట, ఖాదిరాబాద్ రైతులు, గ్రామస్తులతో కలిసి ఆక్రమణకు గురైన భూములను శనివారం పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్‌రెడ్డి అధికార బలంతో ప్రభుత్వ భూములను ఆక్రమి స్తూ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముంపు ప్రాంత భూములను టూరిజం రిసార్ట్ట్, బో టింగ్ వ్యాపారం పేరిట ఆక్రమించే ప్రయత్నా లు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎఫ్టీఎల్ పరిధిలో భారీ యంత్రాలతో భూమిని చ దును చేయడం, సహజసిద్ధంగా ఉన్న కొరివికుంట, నల్లకుంట చెరువుల కట్టలు ధ్వంసం చేయడం పర్యావరణ చట్టాలకు విరుద్ధ్దమని ధ్వజమెత్తారు.
విద్యుత్తు శాఖ అనుమతి లే కుండా ముంపులో కిలోమీటర్ దాకా అక్రమంగా విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అధికార పక్షానికి చెందిన వ్యక్తులు కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు తనిఖీ చేసి అక్రమ నిర్మాణాలు, అక్రమ వి ద్యుత్తు లైన్లను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.