ACB Raid | ఆర్‌అండ్‌బీలో అవినీతి కొండ.. ఏసీబీకి చిక్కిన ఈఎన్సీ మోహన్‌నాయక్.. రూ.180కోట్లకుపైనే పోగేసినట్టు గుర్తింపు
ACB Raids | వజ్రాలు పొదిగిన హారాలు, ధగధగ మెరిసే బంగారు బిస్కెట్లు, వెండి పాత్రలు, బీరువాల్లో కుప్పలుగా డబ్బు కట్టలు, ఇంటిముందు లగ్జరీ కార్లు, చేతుల్లో హైఎండ్ స్మార్ట్ఫోన్లు.. ఇవేకాదు ఖరీదైన ప్లాట్లు, విల్లాలు, పదుల ఎకరాల్లో వ్యవసాయ భూములు.. ఇలా తవ్వినకొద్దీ అతడి అవినీతి గుట్ట కరగడం లేదు.
ACB Raid | హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ) : వజ్రాలు పొదిగిన హారాలు, ధగధగ మెరిసే బంగారు బిస్కెట్లు, వెండి పాత్రలు, బీరువాల్లో కుప్పలుగా డబ్బు కట్టలు, ఇంటిముందు లగ్జరీ కార్లు, చేతుల్లో హైఎండ్ స్మార్ట్ఫోన్లు.. ఇవేకాదు ఖరీదైన ప్లాట్లు, విల్లాలు, పదుల ఎకరాల్లో వ్యవసాయ భూములు.. ఇలా తవ్వినకొద్దీ అతడి అవినీతి గుట్ట కరగడం లేదు. గుట్టుగా దాచిన అక్రమాస్తుల చిట్టా చాంతాడంత ఉండటం చూసిన వాళ్ల కండ్లు కమ్మాయి. వాటి విలువ మార్కెట్లో అక్షరాలా రూ.180కోట్లకు పైనే. ఆదాయానికి మించి భారీగా వెనుకేసుకున్న ఆ అవినీతి తిమింగళాన్ని ఏసీబీకి చిక్కింది. ఆయన పేరే జే మోహన్‌నాయక్.. ఆర్అండ్బీ ఈఎన్సీ. అవినీతి ఆ రోపణలు రావడంతో మంగళవారం ఉద యం హైదరాబాద్, నిజామాబాద్ సహా ఏకంగా రాష్ట్రంలోని 17చోట్ల తనిఖీలు చేసి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకొన్నారు.
హైదరాబాద్ సహా 17 చోట్ల సోదాలు..
మోహన్‌నాయక్ కార్యాలయం, నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇంట్లో జరిపిన తనిఖీల్లో భారీగా భూములు, ఫ్లాట్లు, నగదు, బంగారానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.17,94,62,617 ఆస్తులను గుర్తించారు. బహిరంగ మారెట్లో ఈ ఆస్తుల విలువ రూ.180కోట్లపైనే ఉం టుందని అంచనా వేస్తున్నారు. మోహన్ నాయక్ అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బీ) రెడ్ విత్ 13(2) కింద కేసు నమోదు చేశా రు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇంకా అదనపు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అనే విషయమై తనిఖీలు కొనసాగుతాయని, బినామీలు, బంధువులు గు రించి లోతుగా అధ్యయనం చేస్తామని అధికారులు చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్1064కు, ఫిర్యాదు చేయాలని డీజీ చారుసిన్హా కోరారు.
లంబాడీ ఆఫీసర్లను టార్గెట్ చేయొద్దు
రాష్ట్రంలోని లంబాడీ అధికారులను ఏసీబీ దాడులు, విచారణ పేరుతో టార్గెట్ చేయొవద్దంటూ లంబాడీల ఆత్మగౌరవ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
మోహన్‌నాయక్ ఆస్తుల వివరాలివే..
- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగిలో 19.38 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు.. ప్రభుత్వ విలువ రూ.82లక్షలు
- ఏడు విలాసవంతమైన ఫ్లాట్లు (కొంపల్లిలో 3, గచ్చిబౌలిలో4). వీటి డాక్యుమెంట్ విలువ రూ.7,34,73,867
- హైదరాబాద్ మియాపూర్‌లో ఒక విలాసవంతమైన ట్రిప్లెక్స్ విల్లా, సుమారు రూ.2,50,00,000
- కూకట్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఒక ఇల్లు, విలువ దాదాపు రూ.62,14,000
- నిజామాబాద్‌లో కొత్త విల్లా కొనుగోలు కోసం రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చిన పత్రం.
- సోదాల్లో పట్టుబడిన నగదు విలువ రూ.55లక్షలు
- బ్యాంక్ ఖాతాల్లో నిల్వ ఉన్న నగదు రూ.1,44కోట్లు
- సుమారు 2.5 కిలోలు బంగారు ఆభరణాలు, విలువ దాదాపు రూ.2కోట్లు
- సుమారు 6 కిలోలు వెండి వస్తువులు, విలువ రూ.3,60,000
- ఇండ్లలో ఉన్న విలాసవంతమైన గృహోపకరణాల విలువ రూ.1,26,00,000
- 9 ఖరీదైన మొబైల్ ఫోన్లు, 4 లాప్‌టాప్‌లు స్వాధీనం, వీటి విలువ రూ.11,25,000
- సీజ్ చేసిన రెండు వాహనాల విలువ రూ.25లక్షలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

