హైదరాబాద్, ఆగస్టు26 (నమస్తే తెలంగాణ): గత నెల భారీ వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ పరిశీలించారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకొన్నారు.
త్వరలోనే డ్యామ్ సేఫ్టీ ప్యానల్ సందర్శించాక ప్రాజెక్టు రక్షణ, చేపట్టాల్సిన మరమ్మతులపై తుది అంచనాకు రానున్నారు. కడెం ప్రాజెక్టుతో పాటు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులను కూడా ఈఎన్సీ పరిశీలించారు.