వేములవాడ, నవంబర్ 20 : సీఎం రేవంత్ పాల్గొన్న వేములవాడ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 సభ వెలవెలబోయింది. గుడిచెరువులో నిర్వహించిన సభకు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలను పెద్ద ఎత్తున తరలించాయి. రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్రెడ్డి మధ్యాహ్నం 1.25 గంటలకు సభా స్థలానికి చేరుకున్నారు. సీఎం 36 నిమిషాలపాటు ప్రసంగించా రు. తాము చేస్తున్న అభివృద్ధి గురించి సీఎం చెప్తుండగానే మహిళలు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు. గమనించిన పోలీసులు వారిని బెదిరించి కూర్చోబెట్టే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో రేవంత్ ప్రసంగం పూర్తికాకముందే సగం కుర్చీలు ఖాళీగా కనిపించాయి.