సీన్ 1: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోడానికి రైతన్న కష్టపడు తుండు. ఇదిచూసిన తెలంగాణ ప్రభుత్వం.. ఉపాధిహామీ కింద సిమెంటు కల్లాల్ని నిర్మించుకొనేందుకు అవకాశమిచ్చింది. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు కన్నుకుట్టింది. రెండేండ్లుగా రాష్ట్రంలో కల్లాల నిర్మాణానికైన సొమ్ము 151 కోట్లు తిరిగి చెల్లించాలని హుకుం జారీ చేసింది.
సీన్ 2: గుజరాత్లోని అమ్రేలీ జిల్లా. ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగు తున్నా యని కూలీలు కొన్నేండ్లుగా మొత్తుకుం టున్నా రు. ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు సామాజిక కార్యకర్తలు విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. కాగ్ దర్యాప్తులో రూ.3 కోట్ల అవినీతి తేలింది. అయినా, కేంద్రం నోరుమెదపటం లేదు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని అమ్రేలీ జిల్లా పరిధిలో జరుగుతున్న ఉపాధి పనుల్లో భారీ అవకతవకలు జరిగినట్టు కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక బయటపెట్టింది. కూలీలకు దక్కాల్సిన రూ.3.3 కోట్లను అధికారులు దోచుకొన్నట్టు వెల్లడించింది. ఏడాది క్రితమే కాగ్ నివేదికను సమర్పించి నా.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. విమర్శలు వెల్లువెత్త డంతో తాజాగా రాష్ట్రసర్కారు తాలుకా డెవల ప్మెంట్ అధికారితో దర్యాప్తు చేయించగా, అవినీతి తేలింది. అక్రమానికి పాల్పడ్డ అసిస్టెం ట్ ప్రోగ్రామ్ అధికారి శక్తిసిన్హ్జడేజా, అసిస్టెంట్ అకౌంట్అధికారి విమల్సిన్హ్ బసాన్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ జిగ్నేశ్వడియా, టెక్నికల్ అసిస్టెంట్ అశ్విన్శియాల్పై కేసు నమోదు చేశారు.
నకిలీ గుర్తింపు కార్డులతో..
2015-16 నుంచి 2018-19 మధ్య ఈ అక్రమాలకు పాల్పడ్డట్టు తాలుకా డెవలప్ మెంట్ అధికారి తెలిపారు. ఉపాధి నిధులను కాజేయడానికి నిందితులు.. నకిలీ గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలతో వివిధ బ్యాంకుల్లో 3,310 ఖాతాలను తెరిచినట్టు పేర్కొన్నారు. 36 జిల్లాల్లోని 4,900 నకిలీ జాబ్ కార్డు హోల్డర్ల పేరిట 28,688 లావాదేవీలు జరిపి మొత్తంగా రూ. 3,30,26,548ని పక్కదారి పట్టించినట్టు వెల్లడించారు.