హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ అజగేశన్పై బోర్డులోని ఉద్యోగులు మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఉద్యోగులను మానసికంగా వేధించడమేకాకుండా.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బోర్డు ఉ ద్యోగులు ఆది నుంచీ ఆరోపిస్తున్నారు.
ఉన్నది 21 గుంటలు.. పడ్డది 12గుంటలకు
పాలకుర్తి, ఫిబ్రవరి 7 : జనగామ జిల్లా పాలకుర్తిలోని రైతుకు తన పేరు మీద 21 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా మాత్రం 12 గుంటలకే పడ్డాయి. దీంతో కంగుతిన్న రైతు తనకున్న ది 21 గుంటల భూమి అయితే 12గుంటల భూమికి మాత్రమే డబ్బులు పడడమేంటని వ్యవసాయ శాఖ అధికారులను నిలదీయగా తమకు తెలియదని ప్రభుత్వమే 12 గుంటల భూమికి వేసిందని సమాధానం
ఇచ్చారు.