హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్). ఇది ఒక స్కీం మాత్రమే కాదు.. ఉద్యోగుల జీవన భద్రతను బలిచేసిన పథకం. వృద్ధాప్యంపై చేసిన దాడి. లక్షలాది ఉద్యోగుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన తీరని అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సీపీఎస్‌తో ఉద్యోగులకు భద్రత కరువయ్యింది.
రాష్ట్రంలో సీపీఎస్ అమల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచాయి. బలవంతంగా ఉద్యోగులపై సీపీఎస్ రుద్దిన, ఉద్యోగుల బతుకుల్లో చీకటి నింపిన సెప్టెంబర్ 1ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పెన్షన్ విద్రోహ దినోత్సవంగా పాటిస్తున్నాయి. చీకటి దినంగా అభివర్ణిస్తున్నాయి. సీపీఎస్ రద్దు జంగ్కు రెడీ 9వ పేజీలో
అయ్యాయి. పాత పింఛన్ పునరుద్ధరణ పోరుకు సమరశంఖం పూరించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి జేఏసీలు, సంఘాలు పిలుపునిచ్చాయి. ఇన్నాళ్లు ఓపిక పట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కాంగ్రెస్ మోసంపై గర్జించేందుకు రెడీ అయ్యాయి. టీచర్లు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం బ్లాక్మార్చ్ నిర్వహించనుండగా, రెండు జేఏసీలు, ఇతర సంఘాలు ఉద్యమాన్ని ఉర్రూతలూగించనున్నాయి.