హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగి మరణిస్తే మరణాంతర ఖర్చుల కింద అందజే సే మొత్తాన్ని ప్రభుత్వం పెంచింది. ఇది వరకు అంత్యక్రియల ఖర్చు కింద ఇచ్చే మొత్తం రూ.20వేలు ఉండగా, తాజాగా రూ.30వేలకు పెంచింది. సీఎస్ శాంతికుమారి సోమవా రం జీవో-247ను విడుదల చేశారు. సర్వీసులో ఉండగా మరణించిన ఉద్యోగులకే ఈ మొత్తాన్ని ఇస్తారు. ఉద్యోగి అంత్యక్రియల ఖర్చులను రూ. 50వేలకు పెంచాలని పలు ఉద్యోగ సంఘాలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.