హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకుల నిర్వహణకు ఎమర్జెన్సీ ఫండ్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. మైనారిటీ, ఎస్టీ సొసైటీల్లోని ఒక్కో గురుకుల నిర్వహణకు రూ.10 కోట్ల చొప్పున, ఎస్సీ, బీసీ సొసైటీలోని ఒక్కో గురుకులం నిర్వహణకు రూ.20 కోట్ల చొప్పున నిధులను కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ఆ నిధులతో గురుకులాలకు సంబంధించిన అద్దెలు, డైట్ బిల్లుల చెల్లింపులు, నిర్వహణకు వినియోగించేలా సొసైటీల సెక్రటరీలకే అధికారాలను కల్పించాలని నిర్ణయించినట్టు సమాచారం.