కరెంట్ లైన్‌కు రూ.35 వేల లంచం డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు లైన్ మంజూరుకు కాంట్రాక్టర్ నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్తుశాఖ డివిజనల్ ఇంజినీర్ గురువారం ఏసీబీకి చిక్కా డు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మింట్ కంపౌండ్‌లో ఉన్న టీఎస్ ఎస్పీడీసీఎల్లోని చీఫ్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) కార్యాలయంలో గజవాడ మనోహర్ డీఈగా పనిచేస్తున్నాడు. యాద్రాది భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ఒక వెంచర్లో 5 కేవీ నాన్డొమెస్టిక్కు సంబంధించిన ఎల్టీ క్యాటగిరి-2 లైన్ వేయాలని కాంట్రాక్టర్ బొల్లారం బాలనర్సింహ డీఈని సంప్రదించారు. డీఈ లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. గురువారం కాంట్రాక్టర్ బాలనర్సింహ నుంచి రూ.35 వేల లంచం డీఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.