హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. నాంపల్లిలోని టీజీవో భవన్లో శనివారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏలూరి శ్రీనివాసరావు, ఏనుగుల సత్యనారాయణలను ఇప్పటికే ఎన్నుకున్న విషయం తెలిసిందే.
అసోసియేట్ అధ్యక్షుడిగా బాగారి శ్యామ్, ఉపాధ్యక్షులుగా ఏ జగన్మోహన్రావు, ఎస్ సహదేవ్, మాచర్ల రామకృష్ణాగౌడ్, ఎస్ నరహరిరావు, డాక్టర్ మల్లేశం, దీపారెడ్డి సెక్రటరీలుగా ఏ పరమేశ్వర్‌రెడ్డి, శిరీష, కే శ్రీనివాస్‌రెడ్డి, టీ హరికృష్ణ, పీ శ్రీధర్, టీ సుజాత ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కే కిరణ్‌కుమార్, సురేశ్, పబ్లిసిటీ సెక్రటరీగా ఏ శ్రీనివాస్, సంతోష్‌కుమార్ సహా స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. యుద్ధప్రాతిపదిక పెండింగ్ బిల్లులను చెల్లించాలని, నాలుగు డీఏలను చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దుచేయాలని, ఈహెచ్ఎస్ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.