ఎల్లారెడ్డి, నవంబర్ 29: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ముగ్గురు స్థానికేతరులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు ఎల్లారెడ్డి ఎస్సై గణేశ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసినందున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గానికి సంబంధం లేని స్థానికేతరులు ఉండకూడదు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ ఇంట్లో స్థానికేతరులు ఉన్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లగా.. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రవీణ్‌కుమార్, దోమకొండ మండలం అంచనూర్ వాసి సంతోష్‌రెడ్డి, హైదరాబాద్ సరూర్‌నగర్‌కు చెందిన వెంకటసాయికుమార్లను గుర్తించి, వారిని అదుపులోని తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై గణేశ్ తెలిపారు.