హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో నూతన మాడ్యూల్తో పాస్‌బుక్ లో 11 రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. సిటిజన్ లాగిన్‌లో ‘పాస్‌బుక్ డాటా కరెక్షన్ కోసం దరఖాస్తు’ (అప్లికేషన్ ఫర్ పాస్‌బుక్ డాటా కరెక్షన్) పేరుతో నూతన మాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆప్షన్‌ను క్లిక్ చేశాక ‘న్యూ రిక్వెస్ట్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మనకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకొని, పాస్‌బుక్ నంబర్/ఖాతా/ సర్వేనంబర్ వివరాలు ఎంటర్ చేయాలి.
1. పేరు మార్పు
పొరపాటున వేరే పేరు పడినా, తెలుగు లేదా ఇంగ్లిష్‌లో అక్షర దోషాలు ఉన్నా సవరించుకోవచ్చు.
2. జెండర్
స్త్రీ బదులు పురుషుడు అని పురుషుడు బదులు స్త్రీ అని పడితే మార్పు చేసుకోవచ్చు.
3. క్యాటగిరీ
రిజర్వేషన్ క్యాటగిరీ తప్పుగా నమోదైతే మార్చుకొనేందుకు అవకాశం కల్పించారు.
4. ఆధార్ నంబర్
ఒకవేళ ఆధార్ నంబర్ తప్పుగా నమోదై ఉంటే మార్పు చేసుకోవచ్చు.
5. భూమి స్వభావం
భూమి స్వభావం పట్టా, సీలింగ్, భూదాన్, అసైన్డ్ వంటివి తప్పుగా నమోదై ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
6. భూమి వర్గీకరణ (ల్యాండ్ క్లాసిఫికేషన్)
మాగాణి, తరి, మెట్ట వంటి వివరాలను మార్చుకోవచ్చు.
7.భూమి రకం
భూమి ఏ విధంగా సంక్రమించిందో వివరాలు తప్పుగా నమోదైతే మార్చుకోవచ్చు.
8. ల్యాండ్ ఎంజాయ్మెంట్
సొంతం, వారసత్వం, అన్న, తమ్ముడు, కుమారుడు వంటివి.. ప్రస్తుతం భూమి ఎవరు అనుభవిస్తున్నారో వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.
9.పరిధి దిద్దుబాటు (ఎక్స్టెంట్ కరెక్షన్)్డ
వాస్తవ విస్తీర్ణం కన్నా పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైతే సరిదిద్దేందుకు అవకాశం కల్పించారు.
10.మిస్సింగ్ సర్వే/సబ్ డివిజన్ నంబర్
ఏదైనా సర్వేనంబర్ లేదా సబ్ డివిజన్ నంబర్ పాస్‌బుక్‌లో కనిపించక, ఆ మేరకు విస్తీర్ణం తక్కువగా నమోదైతే మార్చనున్నారు. ఇందుకు సంబంధిత సర్వే నంబర్ వివరాలను ఎంచుకోవాలి.
11.నోషనల్ ఖాతా నుంచి పట్టాకు బదిలీ
ఏదేని కారణంతో భూమి 1బీ ఖాతాలో చేరి, ఆ తర్వాత పరిష్కారమైనవాటిని పట్టాభూమిగా నమోదు చేయించుకొనేందుకు అవకాశం.