ఎల్లారెడ్డిపేట, జూలై 14 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ రైతుల విద్యుత్తు సమస్య తీరింది. మూడు రోజులుగా విద్యుత్తు సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదివారం నిరసన తెలుపగా.. ‘వాన లేదు.. కరెంటు రాదు’ శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..
కరెంటు సరఫరా సక్రమంగా అయ్యేలా చూడాలని అధికారులను వేడుకున్నారు. పొలాల్లోని లూజ్‌లైన్ల సమస్యను పరిష్కరించాలని, ధ్వంసమైన స్తంభాల స్థానంలో కొత్తవి వేయించాలని కోరారు. ‘నమస్తే’ కథనంపై వారు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఏఈ పృథ్వీ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్పై లోడు పెరగకుండా రైతులు సహకరించాలని కోరారు. కెపాసిటర్లను ఏర్పాటు చేసుకుంటే లోడు తగ్గుతుందని, అక్రమ కనెక్షన్లు లేకుండా రైతులు సహకరించాలని సూచించారు.