పాల్వంచ/ మణుగూరు టౌన్ జూలై 29: నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో యాష్, కోల్ ప్లాంట్ల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మణుగూరులో విద్యుత్తు ఉద్యోగులు చేపట్టిన నిరసనలు బుధవారం 31వ రోజుకు చేరాయి. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా పాల్వంచ కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్, మణుగూరు బీటీపీఎస్ ప్రధాన గేటు ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. వైటీపీఎస్‌లో ప్రైవేటీకరణ వద్దంటూ నినాదాలు చేశారు.