హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు గరిష్ఠ డిమాండ్ నమోదవుతున్నది. డిమాండ్‌కు తగి న కరెంటు ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతో ప్రభుత్వం కోతలు విధిస్తున్నది. కానీ ప్రభు త్వం మాత్రం విద్యుత్తు ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించడం లేదని నిపుణులు విమర్శ లు గుప్పిస్తున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో జరుగుతున్న మరమ్మతు పనుల్లో జాప్యమే నిదర్శనమని మండిపడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీటీపీఎస్ యూనిట్-1లో నిరుడు జూన్ 29న భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్తు ఉత్పత్తిచేసే జనరేటర్ ట్రాన్స్ఫార్మ ర్ కాలిపోయింది. అప్పట్నుంచి 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. యూ నిట్-1 పునరుద్ధరణకు సమయం పట్టనుందని తెలుస్తున్నది.
బీటీపీఎస్‌లో మరమ్మతులపై జెన్కో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి ఆదివారం ప్రజాభవన్‌లో సమీక్షించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.