హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్తు కేంద్రాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జిస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. దీంతో గడువు పొడిగించాలని విచారణ సంఘం ప్రభుత్వాన్ని కోరనున్నట్టు సమాచారం. జూలై 29న ఈ విచారణ సంఘాన్ని ప్రభు త్వం నియమించింది. మూడు నెల ల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 29తో ఈ విచారణ సంఘం గడువు ముగియనున్నది. ఆగస్టులో బీఆర్కే భవన్లోని విచారణ సంఘం కార్యాలయానికి వచ్చి కొన్ని కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లను జస్టిస్ మదన్ బీ లోకూర్ ఢిల్లీకి తీసుకెళ్లారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి విచారణసంఘం గతంలో నివేదికను రూ పొందించగా, ఆయా డాక్యుమెంట్లను జస్టిస్ మదన్ బీ లోకూర్ ఇప్పటివరకు అధ్యయనం చేశారు. తాజాగా బుధవారం బీఆర్కే భవన్కు జస్టిస్ మదన్ బీ లోకూర్ వచ్చారు. అనంత రం కార్యాలయ ఉద్యోగులతో సమావేశమయ్యారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన విచారణపై వారితో చర్చించారు.