ప్యూర్ ఈవీ ఎండీ డాక్టర్ నిషాంత్
కంది, అక్టోబర్ 25: ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి భవిష్యత్ ఉందని, ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్యూర్ ఈవీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిషాంత్ దొంగరి పేర్కొన్నారు. శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ వేదికగా వీసీ సర్కిల్-ప్యూర్ ఈవీ సంయుక్తంగా ది పిచ్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టార్టప్ సంస్థలకు నిధుల సమీకరణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60 స్టార్టప్ సంస్థలు, దేశ విదేశాల నుంచి 130 మంది పరిశ్రమల వ్యవస్థాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషాంత్ మాట్లాడుతూ.. స్టార్టప్ నుంచి పాన్ ఇండియా బ్రాండ్‌గా ప్యూర్ ఈవీ ఎదిగిన తీరు, ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన విధానాన్ని వివరించారు.