హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఈ మేరకు శుక్రవారం చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ రాష్ట్రంలో సుమారు లక్ష కుటుంబాలు చేనేతవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత కార్మిక సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసయ్య, గౌరవ అధ్యక్షుడు వెంకట్రాములు, అధ్యక్షుడు సర్వేశ్వ ర్ఉన్నారు.