హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుల పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షణలో జరిగే ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారి, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రంలోని అన్ని కోర్టుల న్యాయవాదులు ఈ ఎన్నికల్లో ఓటు హకును వినియోగించుకోనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటువేసే అవకాశం ఉంటుంది. 23 మంది సభ్యుల పదవుల (వీరిలో విధిగా ఐదుగురు మహిళలు ఉండాలి) కోసం 203 మంది పోటీపడుతున్నారు. వీరిలో 55 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు.
మొత్తం 35,316 మంది ఓటర్లలో 7 వేల మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా 109 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు బాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు చేరాయి. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలతోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆవరణలోని రాష్ట్ర బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఫిబ్రవరి 10 ఉదయం 10.30 గంటల నుంచి ఈ ఎన్నికల ఓట్ల లెకింపు ప్రారంభమవుతుందని బార్ కౌన్సిల్ కార్యదర్శి వీ నాగలక్ష్మి తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో అధిక ఓట్లు సాధించిన 23 మందిని బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఆ తర్వాత వీరంతా బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు అఖిల భారత బార్ కౌన్సిల్ సభ్యుడిని ఎన్నుకుంటారు.
హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా మామునూ రు ఎయిర్‌పోర్టుకు 300ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకు అప్పగించడం చరిత్రలో ని లిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పేర్కొన్నారు. గురువారం బే గంపేట విమానాశ్రయంలో ఏర్పాటుచేసి న సభలో ఆయన మాట్లాడారు. మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూ డెం పట్టణాల్లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని భట్టి విజ్ఞప్తి చేశారు.