హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణవ్యాప్తంగా రూ.639.53 కోట్ల విలువైన సొత్తును పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.239.82 కోట్ల నగదు, రూ.103.79 కోట్ల విలువైన మద్యం, రూ.35.47 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.181.28 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.79.14 కోట్ల విలువైన ఉచితాలు ఉన్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రూ.6.78 కోట్ల విలువైన మద్యం, డబ్బులు, బంగారు ఆభరణాలు, డ్రగ్స్, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.