హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ (సీఆర్పీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా రేగుల సహదేవ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మహబూబ్ బాషా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నికైంది.
వర్కింగ్ ప్రెసిడెంట్గా పడాల రవీందర్, కోశాధికారిగా కంచర్ల మహేందర్, ఉపాధ్యక్షులుగా చందు బట్టు, ఎం జానకిరామ్, గంధం చంద్రశేఖర్, కే శ్రీనివాస్, జీ రాజిరెడ్డి, గంగ్యానాయక్, కార్యదర్శిగా డీ సత్యనారాయణ, సహాయ కార్యదర్శులుగా బర్ల నారాయణ, మామిడి సైదయ్య, కే రాజు, డీ శ్రీధర్, టీ రాజన్న, దత్తు, గట్టయ్య, మురళీ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఆర్పీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.