హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జీ రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీ వెంకటరామిరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా టీ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా జీ రఘువీర్ ప్రసాద్‌గుప్తా, కోశాధికారిగా జేఆర్ఎస్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఫామీం అహ్మద్, అక్తర్, జాయింట్ సెక్రటరీగా దుర్గా ప్రసాద్, వెంకయ్య, ప్రచార కార్యదర్శిగా అశోక్‌కుమార్, రమేశ్‌గౌడ్‌తో పాటు ఇతర కార్యవర్గసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.