హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : త్వరలో మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నిక నిర్వహించనున్నారు. వాస్తవానికి ఉమ్మడి మూడు జిల్లాల ఎన్నిక ఇది. అయితే, ఈ మూడు జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాల సంబంధించిన టీచర్లు ఓటు వేసే అవకాశం ఉన్నది. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల పనిచేసే చోటు కాకుండా ఎక్కడ నివాసముంటే అక్కడ ఓటును నమోదు చేసుకోవచ్చు. ఈ లెక్కన జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లంతా ఓటు హక్కును నమోదు చేసుకొనే అవకాశం ఉన్నది.
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని వారితో పాటు ఈ నియోజకవర్గం పరిధిలోకి రాని ఉమ్మడి నల్లగొండ, మెదక్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులంతా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నివసిస్తూ.. రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా జరిగే ఓటు నమోదులో వీరంతా ఇదే నియోజకర్గంలో ఓట్లను నమోదు చేసుకోవచ్చు. ఈ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు కొనసాగనున్నది. నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ ఏడాది 20 వేలకు పైగా ఓట్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఉదాహరణలిలా..
ఓటు నమోదు నిబంధనలిలా..
ఈ సారి కొత్తగా నమోదుచేసుకోవాల్సిందే
గతంలో ఓటు హక్కు ఉన్నా. ఈ సారి కొత్తగా అంతా నమోదుచేసుకోవాల్సిందే. మూడు ఉమ్మడి జిల్లాల్లో నివాసముండే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు బాధ్యతగా తమ ఓటును నమోదుచేసుకోవాలి. మా కార్యకర్తలు విద్యాసంస్థలు, కాలనీల్లో దరఖాస్తులు అందజేస్తున్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను తాసిల్దార్ , జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో సమర్పించి ఓటు హక్కు పొందవచ్చు.
– గుర్రం చెన్నకేశవరెడ్డి, పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి