BRS Party | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. ఇప్పటికే అన్ని సర్వేలు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో తమకు ఓటమి తప్పదనే భయంతో రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ నేతల ఇండ్లపై దాడులకు దిగుతున్నది. పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేసేందుకు పోలీసులు, అధికారులను ప్రయోగిస్తున్నది రేవంత్ ప్రభుత్వం. ఇందులోనే భాగంగా బీఆర్ఎస్ నేతల ఇండ్లపై ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులతో సోదాలు చేయించింది. మోతీనగర్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో, కూకట్పల్లి బీఎస్పీ కాలనీలో ఉన్న ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని మా ఇండ్ల మీదకు పోలీసులు రావడం చట్టరీత్యా నేరం
నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.. ఇండ్ల మీదకి పోలీసులను పంపుతున్నారు
ఇది గుండాల రాజ్యం.. ఈ రాజ్యంలో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తామన్నట్లు బెదిరిస్తున్నారు
పోలీసులను వాడుకొని జూబ్లీహిల్స్… https://t.co/uVUZCBmbRI pic.twitter.com/9irbdWkw8Q
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2025
ఉప ఎన్నికలు జూబ్లీహిల్స్‌లో జరుగుతుండగా.. సంబంధం లేని ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ నేతల ఇండ్లలో తనిఖీలు నిర్వహించడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోని ప్రాంతంలో అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారంటూ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల పరిధిలో లేని మా ఇండ్ల మీదకు పోలీసులు రావడం చట్టరీత్యా నేరమని, నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.. ఇండ్ల మీదకి పోలీసులను పంపుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. ఇది గుండాల రాజ్యం.. ఈ రాజ్యంలో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తామన్నట్లు బెదిరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులను వాడుకొని జూబ్లీహిల్స్ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు దిగుతున్నారని, పోలీసులు బరితెగించి కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని తక్కెళ్లపల్లి రవీందర్ రావు విమర్శించారు.
ఒడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకుల ఇంటి మీద దాడులు
ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్న రేవంత్
బీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు
మోతి నగర్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో, కూకట్పల్లి బీఎస్పీ… pic.twitter.com/jbsLx9YmKt
— Telugu Scribe (@TeluguScribe) November 7, 2025
మాజీ ఎమ్మెల్సీ మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తన ఇంట్లో అండర్వేర్లు, బట్టలు ఉన్నాయని.. వాటిని తీసుకు వెళ్లాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లోకి మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో సోదాలకు వచ్చిన ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులను మర్రితో పాటు ఆయన అనుచరులు అడ్డుకున్నారు. వారితో ఆయన వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని ప్రాంతంలో ఉంటున్న తన ఇంటికి తనిఖీలకు రావడంపై ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు తన ఇంట్లో బట్టలు మాత్రమే ఉన్నాయి.. వాటిని తీసుకెళ్లండి మర్రి జనార్దన్ రెడ్డి చూపించారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో జరిపిన తనిఖీల్లో తమకు ఎలాంటి డబ్బు, ప్రలోభాలకు గురి చేసే వస్తువులు ఏవీ దొరకలేదని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.