Election Code | హైదరాబాద్‌లో పోలీసుల ముమ్మర తనిఖీలు.. పెద్ద ఎత్తున బంగారం, నగదు పట్టివేత..! కాంగ్రెస్ కుక్కర్లు సీజ్..!
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. క్రమంలో పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బంగారం, వెండితో పాటు నగదు, ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన కుక్కర్లను తనిఖీలో పట్టుకున్నారు. నిజాం కళాశాల ఎదుట పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. క్రమంలో పోలీసులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బంగారం, వెండితో పాటు నగదు, ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన కుక్కర్లను తనిఖీలో పట్టుకున్నారు. నిజాం కళాశాల ఎదుట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానం వచ్చిన వాహనాల్లో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో 7.50 కిలోల బంగారం, 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు చూపకపోవడంతో బంగారాన్ని పట్టుకున్నారు. అలాగే చందానగర్ పరిధి తారానగర్‌లో వాహనాల తనిఖీల్లో 5.56 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు బైక్‌లను సీజ్ చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.11.50లక్షలు పట్టుబడ్డాయి. ఫరూక్నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వద్ద నగదును సీజ్ చేశారు. బైక్‌పై వెళ్తున్న షాద్‌నగర్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి వద్ద నగదును గుర్తించారు. డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు.
పత్రాలను చూపిస్తే నగదును తిరిగి అందజేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే వనస్థలీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.5.14లక్షలు పట్టుబడ్డాయి. సీఐ జలంధర్‌రెడ్డి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోపన్పల్లితండాలో వంటకు వినియోగించే కుక్కర్లను పోలీసులు పట్టుకున్నారు. కుక్కర్ బాక్సులపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్ యాదవ్ పేరుతో సిద్ధంగా ఉన్న 90 కుక్కర్లను పట్టుకున్నారు. ఫిలింనగర్లో మద్యం సీసాలను పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

