ధర్మపురి, మే 24 : కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన ఆ వృద్ధ దంపతులు.. చివరికి మరణంలోనూ కలిసేపోయారు. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్కు చెందిన జంగం రాజయ్య (80), సాయమ్మ (76) దంపతులు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. రాజయ్య శనివారం ఉదయం 11 గంటలకు కొంత అనారోగ్యానికి గురై మృతి చెందగా, కుటుంబ సభ్యులు సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు.
భర్త మృతితో భార్య సాయమ్మ తీవ్ర మనోదనకు గురైంది. రోజంతా రోదిస్తూనే ఉన్నది. అంత్యక్రియలు పూర్తయి ఇంటికి వచ్చన తర్వాత కూడా రోదించింది. రాత్రి 9 గంటలకు ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. సాయమ్మ అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించారు.