EFLU | ఉస్మానియా యూనివర్సిటీ : ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) లో వివిధ పీజీ డిప్లొమా కోర్సులతోపాటు పీహెచ్డీ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారం లింక్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.efluniversity.ac.in లో చూసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 040 – 27689647, 27689481, 27689733 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.