బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 20:37:45

EFLU: చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌

EFLU: చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ : వివిధ కోర్సుల‌కు ఆన్ లైన్ లో నిర్వ‌హించిన చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన‌ట్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజేస్ యూనివ‌ర్సిటీ గురువారం వెల్ల‌డించింది. యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని అండ‌ర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్, పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ అర‌బిక్ కోర్సుల చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను మే 22 నుంచి జూన్ 2వ తేదీ వ‌ర‌కు ఆన్ లైన్ లో నిర్వ‌హించారు. 

అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 338, పీజీ కోర్సుల్లో 465, టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ కోర్సుల్లో 112 మంది పాస్ అయ్యారు. రీజిన‌ల్ క్యాంప‌స్ లు అయిన షిల్లాంగ్, ల‌క్నోలో కూడా ఆన్ లైన్ ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వీటి ఫ‌లితాలు కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తామ‌ని యూనివ‌ర్సిటీ అధికారులు తెలిపారు. 


logo