మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Aug 09, 2020 , 13:42:04

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి

ఆదిలాబాద్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా స్థానిక ఎస్టీయూ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలను తన దృష్టికి తీసుక రావాలని, జిల్లా స్థాయిలో తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తానని తెలిపారు. 


సమస్యలపై చర్చించుకొని పరిష్కరించు కోవాలని సూచించారు. ఆదివాసీల సమస్యల పై కలెక్టర్ కు పలువురు మెమోరాండం సమర్పించారు. అనంతరం స్థానిక బస్ స్టాండ్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని హీరా సుక్క గొండు ధర్మగురు పటాడికి పూజలు నిర్వహించి, కుమ్రం భీం, రాంజీ గోండు విగ్రహాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చందన, గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


logo