హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వసతి గృహ సంక్షేమాధికారుల(హెచ్‌డబ్ల్యూవో) సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హామీ ఇచ్చారు. తెలంగాణ హెచ్‌డబ్ల్యూవో అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించారు. హెచ్‌డబ్ల్యూవోలు కామన్ మెనూ సహా పలు సమస్యలు ప్రస్తావించారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతామని జగదీశ్వర్ తెలిపారు. సమావేశంలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్, కస్తూరి శ్రీకాంత్, మచందర్, ఇమ్మాన్యూయల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షల్లో 27 మంది డిబార్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ కేసు లు, డిబార్ల పర్వం కొనసాగుతున్న ది. రోజుకు ఇరవై మందికిపైగా విద్యార్థులు డిబార్ అవుతున్నారు. తాజాగా సోమవారం ఒకేరోజు 27 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ఫస్టియర్‌లో 14, సెకండియర్‌లో 13 మంది చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యా రు. సోమవారం ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు.