నా కలల ప్రతిరూపమే కన్వెన్షన్ సెంటర్ : మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి పోలీసుల సంక్షేమానికే వెచ్చిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రూ.10కోట్లతో సిద్ధిపేట

సిద్ధిపేట : మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి పోలీసుల సంక్షేమానికే వెచ్చిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రూ.10కోట్లతో సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను మహమూద్ అలీ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రాత్రి పగలు తేడా లేకుండా పని చేసే శాఖనే పోలీస్‌శాఖ అన్నారు.

ఇలాంటి పోలీసులకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని, నా కలల ప్రతిరూపమే మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అన్నారు. సీపీ జోయల్ డేవిస్ సారథ్యంలో నా కల సాకారమైందంటూ హర్షం వ్యక్తం చేశారు. మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వేగంగా పూర్తి చేసిన సీపీ, కాంట్రాక్టర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సిద్ధిపేట మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ తొలి అడుగు మాత్రమేనని, ప్రతి జిల్లాలో ఇలాంటి సెంటర్ నిర్మిస్తామన్నారు. పోలీస్ శాఖకు మంజూరైన పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన స్థలాలను త్వరలోనే గుర్తిస్తామన్నారు. పోలీస్ సంక్షేమ నిధికి మరిన్ని ఫండ్ జమ అయ్యేలా కృషి చేస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

