సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేలో బీసీ జనాభాను తక్కువగా చూపించడం వెనుక ప్రముఖ పాత్ర పో షించిన మాజీ మంత్రి జానారెడ్డికి బీసీల సత్తా చూపిస్తామని సూర్యాపేట జిల్లా బీసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. సూర్యాపేటలోని వాణిజ్యభవన్ సెంటర్లో మంగళవారం జానారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో బీసీల జనాభా పెరిగితే కాంగ్రెస్ సర్కారు సర్వేలో 21 లక్షలు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. 7 శాతం ఉన్న ఓసీలు 15 శాతం ఎలా అ య్యారని నిలదీశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా రెడ్డీలతో కలిసి జానారెడ్డి బీసీ జనాభాను తగ్గించారని ఆరోపించారు. కులగ ణన మళ్లీ నిర్వహించాలని తెలిపారు.