హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సర్కారు పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. చదువులకు పెద్దపీట వేసింది. ఇందుకు బడ్జెట్ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపుల కంటే బీఆర్ఎస్ అధికంగా ఖర్చుచేసింది. అదే కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ కేటాయింపుల కంటే తక్కువగా ఖర్చుచేయడం గమనార్హం. ఈ విషయాన్ని సాక్షాత్తు కాంగ్రెస్ ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది. బీఆర్ఎస్ హయాంలో బడ్జెట్ కేటాయింపులు, వ్యయం ఘనంగా ఉండగా, కాంగ్రెస్ పాలనలో ఖర్చు అధ్వానం అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. మంగళవారం బడ్జెట్ పద్దు పుస్తకాల్లో ఇదే విషయాన్ని పొందుపరిచింది.