TG TET | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): టెట్ షెడ్యూల్ విషయంలో స్పష్టత కొరవడింది. ప్రభుత్వమే పరస్ప ర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వంలో సమన్వయం కొరవడింది. టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తామ ని, జూన్‌లో ఒకసారి, డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం జీవో 18 ను విడుదల చేశారు.
జూలై 5న జీవోను విడుదల చేయగా, ఆగస్టు 3న ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో టెట్ ను జనవరి 2025లో నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. నెలరోజుల వ్యవధిలోనే డిసెంబర్లో అని జీవో, జనవరిలో అని జాబ్ క్యాలెండర్లో ప్రకటించడంతో సందిగ్ధత నెలకొన్నది. సాక్షాత్తు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పరస్పర విరుద్ధంగా ఉంటే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని కోరుతున్నారు.