ఆడపిల్లల చదువుతోనే సమాజం అభివృద్ధి : మంత్రి ఎర్రబెల్లి
జనగామ : ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల వెలుగు స్కూల్ విద్యార్థినిలకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడ వాళ్లు అన్ని రంగాల్లోనూ ముందున్నారని చెప్పారు. ఆడపిల్లల విద్యను ప్రోత్సహించాలన్నారు. పిల్లల చదువుల పట్ల తల్లి తండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి ఆశలు, ఆశయాలకు తగ్గట్లుగా పిల్లలు చదువుకోవాలని ఆయన సూచించారు.

పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరితేనే చదువుకు సార్ధకత లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు ఎదగాలన్నారు. వారికి అందుతున్న సదుపాయాలు, చదువులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

