ఏసీబీకి చిక్కిన ఎంఈవో
ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలువాల్సిన విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఓ ఉత్తమ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం జడ్పీహెచ్ఎస్లో జరిగింది.
గూడూరు, ఏప్రిల్ 8 : ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలువాల్సిన విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఓ ఉత్తమ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం జడ్పీహెచ్ఎస్లో జరిగింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. గూడూరు మండలం వాగ్యాతండా పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఈ నెల 30న రిటైర్ అవుతున్నాడు. అతడు ముందస్తుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎంఈవో రవికుమార్‌కు తన సర్వీస్‌బుక్, ఇతర పత్రాలను 4 నెలల క్రితమే హైదరాబాద్ ఆడిటింగ్ ఆఫీస్‌కు పంపించమని కోరుతూ ఆధారాలు అందజేశారు.
ఫైల్‌ను హైదరాబాద్‌కు పంపాలంటే రూ.45వేలు ఖర్చవుతాయని, అయోధ్యపురం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చంద్రమౌళిని కలిసి, డబ్బులు ఇవ్వాలని ఉపాధ్యాయుడికి ఎంఈవో సూచించారు. దీంతో ఉపాధ్యాయుడు రూ.15 వేలు ఇస్తానని ఒప్పుకొని వరంగల్‌లోని ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే బుధవారం అయోధ్యపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా కూడా పనిచేస్తున్న ఎంఈవో రవికుమార్, ఉపాధ్యాయుడు చంద్రమౌళిని కలిసి బాధితుడు రూ.15వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని ఏసీబీ కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

