TSPSC | హైదరాబాద్ : రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లల్లో ఖాళీగా ఉన్న 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ పోస్టులకు గతేడాది డిసెంబర్ నెలలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 6 నుంచి 27వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది టీఎస్పీఎస్సీ. అయితే పలువురు అభ్యర్థుల దరఖాస్తుల్లో తప్పులు దొర్లడం కారణంగా.. వారి విజ్ఞప్తుల మేరకు ఎడిట్‌కు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు సూచించారు.
-హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1(ట్రైబల్ వెల్ఫేర్) -05
-హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2(ట్రైబల్ వెల్ఫేర్) – 106
-హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు (ఎస్సీ డెవలప్మెంట్) -70
-హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్మెంట్) – 228
-హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
-వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05
-మ్యాట్రన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
-వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
-మ్యాట్రన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02
-లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – 19