హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ జోన్ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దాచా జనార్దన్ మహేశ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనకు చెందిన రూ.5.15 కోట్ల విలువైన 19 స్థిరాస్తులను తాతాలికంగా జప్తు చేసింది. జనార్దన్ మహేశ్‌పై గతంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఆదాయానికి మించి అదనంగా ఆయన దాదాపు రూ.5.27 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సంపాదనను జనార్దన్ మహేశ్ తన కుటుంబసభ్యుల పేరిట పెట్టుబడి పెట్టినట్టు ఈడీ వెల్లడించింది.
బ్యాంకును మోసగించిన కేసులో రూ.2.91 కోట్ల ఆస్తులు జప్తు
ఫోర్జరీ పత్రాలు, తప్పుడు వర్ ఆర్డర్లు సమర్పించడం ద్వారా అక్రమంగా రూ.12.30 కోట్ల రుణాలు పొంది చందానగర్‌లోని సిండికేట్ బ్యాంక్‌ను మోసగించిన కేసులో కొర్రపాటి సుబ్బయ్య అనే వ్యక్తికి చెందిన రూ.2.91 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, ప్లాట్లు, వాణిజ్య ఆస్తులను ఈడీ జప్తు చేసింది.